ఇండియన్ మైకల్ జాక్సన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రభుదేవా(Prabhudeva) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా నటుడిగా డైరెక్టర్ గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ సాధించినటువంటి ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.
ఈయన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హిమాని(Himanee) అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే గత కొద్ది రోజుల క్రితం తన రెండో భార్యను ప్రభుదేవా పరిచయం చేశారు.
అయితే గత రెండు రోజులుగా ప్రభుదేవా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్( Prabhudeva news viral on social media ) గా మారింది ప్రభుదేవా 50 సంవత్సరాల వయసులో రెండోసారి తండ్రి అయ్యారని ఈయన రెండో భార్యకు కూతురు జన్మించింది అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలు గురించి ఎలాంటి క్లారిటీ లేకపోయినా ఈ వార్తలు వైరల్ కావడంతో స్వయంగా ప్రభుదేవా ఈ వార్తలపై స్పందించారు.
ఈ సందర్భంగా ప్రభుదేవా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అవును తాను తండ్రిని అయ్యానని చెప్పుకొచ్చారు.
50 సంవత్సరాల వయసులో తాను తండ్రి అయ్యానని, ప్రస్తుతం నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఇప్పుడు నా జీవితం సంపూర్ణమైనట్టు అనిపిస్తుందని ఈయన తెలియచేశారు.ఇప్పటికే తాను ఒక్క క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాను నిజం చెప్పాలి అంటే పరిగెడుతున్నాను.
ఇకపై పని భారాన్ని తగ్గించుకొని కాస్తా తీరిక పడుతూ తన కుటుంబం కోసం సమయం కేటాయించాలని భావించినట్లు ప్రభుదేవా తెలిపారు.ఇలా రెండో భార్య గురించి తనకు కూతురు జన్మించింది అనే విషయం గురించి ప్రభుదేవా ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.