రెబల్ స్టార్ కృష్ణం రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యాలతో బాధ పడుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.ఈ రోజు తెల్లవారు జామున కృష్ణం రాజు (83) చికిత్స పొందుతూ 3.25 గంటలకు కన్నుమూసినట్టు తెలుస్తుంది.కృష్ణం రాజు మరణ వార్త విని ఈ రోజు టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈయన ఫ్యాన్స్ అంతా ఈయన లేరనే వార్త తెలియడంతో దుఃఖ సాగరంలో మునిగి పోయారు.
ఈయనకు భార్య శ్యామలాదేవి.
ఇద్దరు కూతుర్లు ఉన్నారు.అలాగే ఈయన ప్రభాస్ పెద్దనాన్న అని తెలిసిందే.
కృష్ణం రాజుకు మొగపిల్లలు లేకపోవడంతో ప్రభాస్ నే తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.అయితే ఈయన రెబల్ స్టార్ గా మారడానికి ముందు చాలా కష్టపడ్డారు.
ఈయన కెరీర్ లో ముందు విలన్ గా చాలా సినిమాలు చేసారు.
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 10 ఏళ్ల పాటు కష్టపడ్డాకనే ఈయన హీరోగా మారి స్టార్ డమ్ అందుకున్నారు.
దాసరి నారాయణరావు ఈయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయాలను అందించి ప్రేక్షకుల్లో రెబల్ స్టార్ గా ఎదిగేందుకు దోహద పడ్డారు.ఈయనను విలన్ పాత్రల్లో చూసి బయపడినే లేడీ ఫ్యాన్స్ చేతనే ఆ తర్వాత జేజేలు అందుకున్నాడు.

ఇక కృష్ణం రాజు తన కెరీర్ లో మొత్తం 180 కి పైగానే సినిమాల్లో నటించారు.చిలక-గోరింక సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఇలా ఈయన పుష్కరకాలం పాటు ప్రయత్నించినా తర్వాతనే హీరోగా స్థిరపడ్డారు.మన తెలుగు హీరోల్లో ఇలా 10 ఏళ్ల కష్టం తర్వాత హీరోగా స్టార్ డమ్ అందుకున్నది ఇద్దరే నట.ఒకరు కృష్ణం రాజు కాగా.మరొకరు శోభన్ బాబు.
తహసీల్దారుగారి అమ్మాయి సినిమాతో పెద్ద విజయం అందుకుని స్టార్ డమ్ తెచ్చుకుని ఈ రోజు ప్రేక్షకుల మదిలో నిలిచి పోయారు.ఇక ఈయన చివరి సినిమా రాధేశ్యామ్ గా నిలిచి పోయింది.
కృష్ణం రాజు నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు సేవ చేసారు.