సలార్ సక్సెస్ అయితేనే అక్కడ ప్రభాస్ స్టార్ అవుతాడు...

ప్రభాస్( Prabhas ) హీరోగా వస్తున్న సలార్ సినిమా( Salaar movie ) పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలతో వస్తుంది.

ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ డమ్ అనేది పెరుగుతూ పోతుందనేది మాత్రం వాస్తవం ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ అంటే నార్త్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.

సలార్ సినిమా కోసం తెలుగులో కంటే నార్త్ లో ఉన్న అభిమానులు ఎక్కువగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక డిసెంబర్ 22వ తేదీన సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయబోతుందనే విషయంలో అయితే క్లారిటీ వచ్చేసింది.

ఇక రీసెంట్ గా అనిమల్ సినిమా( Animal movie ) ఎంతటి ఘన విజయం సాధించిందో దానికి మరో రేంజ్ లో సలార్ సినిమాతో ప్రభాస్ ప్రభంజనం సృష్టించబోతున్నాడు అనేది మాత్రం వాస్తవం ఇక ఈ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి చూపించడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా కనక సక్సెస్ సాధిస్తే నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా మీద కూడా అంచనాలు భారీ స్థాయి లో పెరుగుతాయి.ఇక కల్కి సినిమా( Kalki movie ) మాత్రం భారీ రేంజ్ లో ఉండబోతున్నట్టుగా మనకు ఆ గ్లిమ్స్ చూస్తేనే అర్థమయిపోయింది.

ఇకమీదట ప్రభాస్ వరుస సినిమాలతో దండయాత్ర చేయబోతున్నాడని తెలుస్తుంది.ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుంచి పెద్దగా సక్సెస్ లేని ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించడానికి మన ముందుకు వస్తున్నాడు అని తెలుస్తుంది.ఇక ప్రభాస్ తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలయితే వస్తున్నాయి.

Advertisement

ఇక ఈ సలార్ ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు