ప్రభాస్ "అన్ స్టాపబుల్" సెకండ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్..!

దేశంలో అన్ని టాకీ షోలలో ఆహా "అన్ స్టాపబుల్" నెంబర్ వన్ షోగా నిలిచిన సంగతి తెలిసిందే.

హోస్ట్ గా బాలకృష్ణ అందరి అభిమానాన్ని సంపాదించుకుంటూ మంచి ఎనర్జిటిక్ గా షో నడిపిస్తున్నారు.

షోకి వచ్చే అతిథులను చమత్కరమైన ప్రశ్నలతో.కామెడీ పండిస్తూ మరికొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు వేస్తూ రసవత్తరంగా ముందుకు నడిపిస్తున్నారు.

ప్రస్తుతం సెకండ్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ హైలెట్ గా మారింది.

రెండు భాగాలుగా ప్రభాస్ ఎపిసోడ్ నీ రూపొందించారు.మొదటి ఎపిసోడ్ ఆల్రెడీ డిసెంబర్ 29వ తారీకు స్ట్రీమింగ్ అయింది.

Advertisement

భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.ఇక రెండవ ఎపిసోడ్ జనవరి 6వ తారీకు స్ట్రీమింగ్ కానుంది.

ఈ క్రమంలో ప్రభాస్ "అన్ స్టాపబుల్" రెండవ ఎపిసోడ్ ప్రోమో తాజాగా ఆహా టీం రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో ప్రభాస్ తనతో పాటు షోలో పాల్గొన్న మరో హీరో గోపీచంద్ తో చేసిన కామెడీ మధ్యలో బాలకృష్ణ అడ్డుపడటం హైలైట్ గా మారింది.

ఇక ఇదే సమయంలో "బాహుబలి" తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పరాజయం పాలైన దాని గురించి బాలయ్య ప్రశ్నలు వేసినట్లు ప్రోమోలో చూపించారు.ఈ ప్రోమోలో ఫస్ట్ ఎపిసోడ్ కంటే మరింత ఫ్రీగా బాలకృష్ణతో ప్రభాస్ మాట్లాడుతున్నట్లు.

కనిపించటం విశేషం.

ఈ ఒక్క సెట్టింగుతో స్పామ్ కాల్స్ నుండి ఉపశమనం పొందండి!
Advertisement

తాజా వార్తలు