బాలు చనిపోయారంటూ కమెడియన్ పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం

టాలీవుడ్ గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతకొద్ది రోజులుగా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ సోకడంతో ఆయన ఆగష్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.

అక్కడ ఆయనకు కరోనా చికిత్సను అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ వస్తున్నారు.ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

కాగా చికిత్సకు ఆయన బాగానే స్పందిస్తున్నట్లు బాలు కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇక రీసెంట్‌గా ఆయనకు వెంటిలేటర్ సాయం లేకుండానే చికిత్స అందిస్తున్నామని, త్వరలోనే ఆయన ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్తారని ఆసుపత్రి వర్గాలు అన్నాయి.

కానీ హఠాత్తుగా గురువారం(సెప్టెంబర్ 24) రాత్రి బాలు ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, ఆయనకు వెంటనే వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తు్న్నట్లు ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ఇక శుక్రవారం ఉదయం ఎంజీఎం ఆసుపత్రి బాలు ఆరోగ్యం గురించిన హెల్త్ బుల్లెటిన్‌ను తాజాగా విడుదల చేసింది.

Advertisement

బాలు ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉందని వారు తెలిపారు.అయితే ఈ క్రమంలో బాలు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కోరుతుండగా, ఓ టాలీవుడ్ కమెడియన్ మాత్రం బాలు చనిపోయారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

టాలీవుడ్ కమెడియన్ ప్రభాస్ శ్రీను ఇలా బాలు మృతి చెందారంటూ పోస్ట్ పెట్టడంతో ఆయన ఇంకా బతికుండగానే ఇలాంటి పోస్ట్ పెట్టడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు.ఇలాంటి సమయంలో బాలు గురించి అలాంటి పోస్ట్ పెట్టడం నీచమైన చర్య అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాలు త్వరగా కోలుకోవాలని యావత్ సినీ ప్రేక్షకులు కోరుతున్నారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు