ఆమె బిగ్గెస్ట్ సూపర్ స్టార్.. ప్రభాస్ చేత ప్రశంసలు పొందిన ఆ నటి ఎవరో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Rebel Star Prabhas ) ఎంతో టాలెంట్ ఉంటే తప్ప అవతలి వ్యక్తులను ప్రశంసించడానికి ఇష్టపడరు.

తాజాగా దీపికా పదుకొనే గురించి ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) సినిమాలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే కనిపించనున్న సంగతి తెలిసిందే.అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ దీపికా పదుకొనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అన్నారు.

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే( Heroine Deepika Padukone ) అద్భుతమైన నటి అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.చూడటానికి దీపికా పదుకొణే చాలా అందంగా కనిపిస్తారని ప్రభాస్ కామెంట్లు చేశారు.దీపిక ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిందని ప్రభాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

దీపికా పదుకొనే కల్కి మూవీ సెట్ లో అడుగుపెట్టిన ప్రతిసారి అందరిలో ఉత్సాహం వస్తుందని స్టార్ హీరో ప్రభాస్ కామెంట్లు చేయడం గమనార్హం.దీపికా పదుకొనేతో కలిసి నటించాలని ఉందని ఎప్పటినుంచో అనుకుంటున్నానని ప్రభాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

దీపికతో కలిసి నటించడం ఇప్పటికి కుదిరిందని ఆయన పేర్కొన్నారు.ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా( Project K Movie )పై అకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో అభిమానులను మెప్పించే అంశాలు ఎక్కువగానే ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

అశ్వనీదత్( Producer Ashwinidutt ) నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.ప్రాజెక్ట్ కే మూవీ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిసుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రాజెక్ట్ కే మూవీ సంచలనాలను సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.ప్రభాస్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

ప్రభాస్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు