'సలార్' నైజాం రైట్స్ సోల్డ్.. ఏకంగా అన్ని కోట్లతో డీల్ పూర్తి!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ పోతున్నాడు.

అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.

మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో సలార్( Salaar ) ఒకటి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేశారు.దీంతో సలార్ మూవీ టీజర్ తోనే మాసివ్ బిజినెస్ చేసుకుంటుంది.

వరల్డ్ వైడ్ గా మాసివ్ బిజినెస్ చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా నైజాంలో ఈ మూవీ ఎంత బిజినెస్ చేసిందో తెలుస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారట.

Advertisement

ఒక్క నైజాం లోనే ఈ సినిమా 65 కోట్లకు అమ్ముడు పోయిందట.మరి దిల్ రాజు డీల్ సొంతం చేసుకోవడంతో రిలీజ్ కూడా అదే రేంజ్ లో ఉండనుంది.కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

ఆదిపురుష్( Adipurush ) వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోని ప్రభాస్ కు ఇది ఆ రేంజ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.చూడాలి మరి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో ఆ రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు