ఆదిపురుష్ కోసం ప్రభాస్ షాకింగ్ త్యాగం.. అభిమానులకు నిరాశే?

తెలుగు సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత అదే క్రేజ్ ని మెయింటైన్ చేస్తూ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.

 Prabhas Sacrifice For Adipurush Movie ,prabhas, Aadi Purush, Salaar, Tollywood,-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా బోలెడు ప్రాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్.

అయితే ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడు కానీ సినిమాల విషయంలో మాత్రం అభిమానులకు నిరాశ తప్పడం లేదు.వరుసగా సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ తన సినిమాలకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ ని కూడా విడుదల చేయడం లేదు.

కాగా గత ఏడాది ఆది పురుష్ సినిమా టీజర్ విడుదల కాగా ఏ రేంజ్ లో విమర్శలను ఎదుర్కొందో మనందరికీ తెలిసిందే.దీంతో ట్రోలర్స్ కి చెక్ పెట్టి ఆ సినిమాను మళ్ళీ ఎడిట్ చేసే పనిలో పడ్డారు మూవీ మేకర్స్.

ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలోనే కాకుండా ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అయితే భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఆది పురుష్ సినిమా ఊహించిన విధంగా భారీగా విమర్శలను ఎదుర్కోవడంతో ఇప్పుడు అభిమానులు అందరూ ఆశలు అన్ని సలార్ సినిమాపై పెట్టుకున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.కాగా సలార్ సినిమాకు కే జి ఎఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Telugu Salaar, Aadi Purush, Baahubali, Om Raut, Prabhas, Prashanth Neil, Project

అభిమానులు ఆశలు, జనాలు చూపులు అన్నీ కూడా సలార్ సినిమాపై పడడంతో ఆదిపురుష్ సినిమా గురించి ఎవరు ఆలోచించడం కూడా లేదు.జూన్ లో విడుదల కాబోతున్న ఆది పురుష్ సినిమాపై అభిమానులకు కూడా పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఈ విషయంలో ఏకంగా డార్లింగ్ ప్రభాసే బరిలోకి దిగినట్టు తెలుస్తోంది.సలార్ సినిమాకు సంబంధించిన అప్డేట్లు విడుదల అయితే అందరికీ ఆది పురుష్ సినిమాపై ఆసక్తి లేకుండా పోతుంది అన్న కారణంతో ఆదిపురుష్ సినిమా విడుదల అయ్యే వరకు సలార్ కు సంబంధించిన అప్డేట్స్ నీ హోల్డ్ లో పెట్టాల్సిందిగా ప్రభాస్ నుండి సూచనలు వెళ్లినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే డైరెక్టర్ ఓం రౌత్ ఇప్పటికే చేయాల్సిన అన్నీ మార్పులు చేసి.

Telugu Salaar, Aadi Purush, Baahubali, Om Raut, Prabhas, Prashanth Neil, Project

ఆదిపురుష్ సినిమాకి న్యూ టచ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.డార్లింగ్ ప్రభాస్ కూడా ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నట్టు సమాచారం.ఇందుకు కారణం లేకపోలేదు.ఒకవేళ మ్యాజిక్ వర్కౌట్ అయ్యి.ఆదిపురుష్ గనుక బాక్సాఫీస్ వద్ద నిలబడితే మైథలాజికల్ మూవీ కాబట్టి భారీ కలెక్షన్స్ రావడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube