‘RC15’ ముగించి ఇండియన్ 2 సెట్స్ లోకి అడుగెట్టిన శంకర్!

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మాత్రం ఒకే సారి రెండు మూడు సినిమాలు చేయడం ఇప్పటి వరకు మనం చూసాం.కానీ మొదటిసారి స్టార్ డైరెక్టర్ ఒకేసారి రెండు సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 Director Shankar Is Back To Rc 15 Sets From Indian 2 Now-TeluguStop.com

రెండు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలే.మరి ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుందిగా.

ఆయనే మావెరిక్ డైరెక్టర్ శంకర్.

ఈయన పాన్ ఇండియా వ్యక్తంగానే కాకుండా హాలీవుడ్ లెవల్లో గుర్తింపు పొందాడు.

ప్రతీ సినిమా గ్రాండ్ ఎలిమెంట్స్ తో సాలిడ్ ప్రమోషన్స్ తో హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోకుండా తెరకెక్కించడం శంకర్ కు వెన్నతో పెట్టిన విద్య.అయితే ఎప్పుడు ఒక సినిమా తర్వాత మరొకటి ప్లాన్ చేసే శంకర్ ఈసారి మాత్రం రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు.

ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘RC15’ చేస్తూనే మరో వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు.

ఎప్పుడో రెండేళ్ల క్రితమే వాయిదా పడిన ఈ సినిమాను శంకర్ మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేసాడు.అప్పటికే రామ్ చరణ్ సినిమాను సగం పూర్తి చేయడంతో రెండింటిని బ్యాలెన్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.అందుకే ఒక షెడ్యూల్ అది.ఒక షెడ్యూల్ ఇది అని రెండింటిని తెరకెక్కిస్తున్నాడు.ఇలా ఏకకాలంలో రెండు భారీ సినిమాలు చేయడం రికార్డ్ అనే చెప్పాలి.

ఇటీవలే రామ్ చరణ్ సినిమాలో ఫుల్ బిజీ అయినా శంకర్ మళ్ళీ ఇప్పుడు ఇండియన్ 2 సెట్స్ లో జాయిన్ అయినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.బ్యాక్ టు ఇండియన్ 2 సెట్స్ అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.రెండు సినిమాలను ఒకేసారి చేస్తూ శంకర్ మంచి హుషారుగా ఉన్నాడు.

చూడాలి వీటిలో ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube