యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా గత నాలుగు ఏళ్లుగా ఊరిస్తూ ఉంది.
ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు జాతీయ స్థాయి అంచనాల నడుమ రాబోతుంది.
హిందీ తో పాటు ప్రతి ఒక్క ఇండియన్ లాంగ్వేజ్ జనాలు కూడా రాధే శ్యామ్ ను చూడాలనే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు.సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.
ఇప్పటి వరకు జరగనటువంటి ఒక భారీ నేషనల్ లెవల్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.రికార్డులను బ్రేక్ చేసేంతటి జనం మరియు దేశ వ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు.
ఈనెల 23న రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ వద్ద జరుగబోతున్న ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.భూమి పూజ నిర్వహించి.
పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఏర్పాట్లు మొదలు పెట్టారు.శ్రేయాస్ మీడియా వారు ఈ భారీ వేడుకను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
ఇప్పటి వరకు శ్రేయాస్ మీడియా ఎన్నో భారీ ఈవెంట్స్ ని నిర్వహించడం జరిగింది.ఖచ్చితంగా ఈ ఈవెంట్ ను కూడా అత్యంత భారీ ఎత్తున నిర్వహించి సక్సెస్ ను దక్కించుకుంటారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
చాలా నమ్మకంతో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బాధ్యతను శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారికి అప్పగించడం జరిగింది.ఆయన ఏమాత్రం లోటు లేకుండా అభిమానుల కోసం.వచ్చే అతిథుల కోసం ఏర్పాట్లు చేయిస్తున్నారు.
ఈ ఈవెంట్ ను శ్రేయాస్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.రాధే శ్యామ్ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ లో వంశీ మరియు ప్రమోద్ లు నిర్మించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy