యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
ప్రస్తుతం తన 20వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ
డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనుంది.ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ చాలా కొత్తగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది.ఇటీవల
జార్జియా
లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, ప్రస్తుతం కరోనా ప్రభావంతో షూటింగ్‌ను వాయిదా వేసుకుంది.
ఈ సినిమా 1960 సమమానికి చెందిన కథగా మనముందుకు వస్తుంది.దీని కోసం ప్రభాస్ వింటేజ్ లుక్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ వింటేజ్ లుక్‌లో
ప్రభాస్
లుక్ ఓ రేంజ్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.ప్రభాస్ క్రేజ్‌కు తగ్గట్టుగా ఆయన లుక్‌ను డిజైన్ చేశారట.
ఈ సినిమాలో
పూజా హెగ్డే
లుక్ కూడా అదే విధంగా ఉంటుందని తెలుస్తోంది.
మొత్తానికి
ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ
తో ప్రభాస్ ఈ సారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్నాడు.
మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి అంటున్నారు జనం.