యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ”సలార్” ( Salaar ).సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కడంతో ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కేజిఎఫ్ సిరీస్ తర్వాత ఈయన మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.పైగా డార్లింగ్ ప్రభాస్ హీరో కావడంతో సలార్ సినిమాకు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.దీంతో రేపే రిలీజ్ కాబోతున్నా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా అన్ని సినిమాలకు రిలీజ్ కంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారని అందరికి తెలుసు.

కానీ ఈ సినిమాకు మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండానే రిలీజ్ చేస్తున్నారు.దీంతో చాలా మంది ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు అనే అనుమానం కలిగింది.మరి ఈ విషయంపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు.
సలార్ రిలీజ్ తర్వాత పెద్ద వేడుక చేస్తామని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండడంతో ప్రీ రిలీజ్ వేడుక చేయడానికి కుదరలేదని అందుకే రిలీజ్ తర్వాత మరింత గ్రాండ్ గా వేడుక నిర్వహిస్తామని తెలిపారు.
దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ముందే ఫిక్స్ అయినట్టే అనిపిస్తుంది.ఏది ఏమైనా ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి…

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించగా డిసెంబర్ 22న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.