ప్రభాస్ కల్కి 2898AD సినిమా ప్లస్ మరియు మైనస్ పాయింట్స్ ఇవే !

కల్కి సినిమా( Kalki 2898 AD Movie ) ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలయ్యింది.

ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని థియేటర్ కి వెళ్లి ఆ విజువల్ వండర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని తహతహలాడుతున్నారు.

అలాగే సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడి కూడా కొన్ని విషయాలకు ఆశ్చర్య పోతే కొన్ని విషయాల్లో డిసప్పాయింట్ అయ్యారు.ఇంతకీ కల్కి సినిమా అటు ప్రభాస్ ఇటు నాగ అశ్విన్ భవిష్యత్తును నిర్ణయించే సినిమా.

అలాగే ఈ చిత్రంలో ఎంత మంచి పాజిటివ్ అంశాలు ఉన్నాయో అంతే నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి.ఇలా చెప్తే ప్రభాస్ ఫాన్స్( Prabhas ) కి నచ్చకపోవచ్చు.

కానీ టికెట్ కొని థియేటర్ కి వెళ్లే ప్రతి ప్రేక్షకుడి కూడా వెళ్లే ముందు ఈ అంశాలు తెలుసుకొని వెళ్లాల్సిందే.మరి ఇంతకీ ఆ ప్లేస్ మరియు మైనస్ పాయింట్స్ ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్లస్ పాయింట్స్

Advertisement

కల్కి సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఒక విజువల్ వండర్ ని చూస్తున్న ఫీల్ తోనే ఉంటాడు.అలాగే సినిమా మొదటి ఇంటర్వెల్ లో అద్భుతమైన సీన్స్ ఉన్నాయి.అలాగే క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రేక్షకుణ్ణి మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ఈ క్లైమాక్స్ ఉండడంతో బయటకు వచ్చే ప్రేక్షకుడు ఒక గొప్ప థ్రిల్ తో వస్తాడు.

ఇప్పటి వరకు ఇండియన్ తెరపై ఎవ్వరూ చూడని సిజి షార్ట్స్ చూసి హౌరా అనిపించకుండా ఉండదు.ఇక ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ ప్రభాస్ ని చూపించిన విధానం.

భైరవ పాత్రలో చాలా సరదాగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.ఎక్కడ ఓవర్ ఎలివేషన్స్ ఇవ్వకుండా ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ పెంచాలో క్లారిటీతో భైరవ పాత్ర ఉంటుంది.

మైనస్ పాయింట్స్

ఇక కల్కి సినిమా మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, ఈ సినిమాలో నాగ అశ్విన్ రాసుకున్న కథనే పెద్ద మైనస్ పాయింట్ సరిగ్గా కథపై ఎక్కడ ఫోకస్ పెట్టలేదు. విజువల్ ని కళ్ళకు అద్భుతంగా చూపించడం పై పెట్టిన శ్రద్ధలో 10% కథ పై పెట్ట ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది.ఎక్కడ కూడా స్టోరీ సరిగా కన్వే చేయలేకపోయాడు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

అనవసరమైన సీన్స్ కనిపిస్తున్నాయి.అలాగే చాలా సీన్స్ ల్యాగ్ కూడా ఉన్నాయి.

Advertisement

చాలామంది ఎంట్రీ ఎందుకు జరుగుతుందో తెలియదు దీపికా పడుకున్న ఎందుకు బిడ్డను కంటుందో తెలియదు.అలా ఒక ప్రపంచంలోకి తీసి వదిలేశారు.

కానీ ఏ విషయాన్ని చెప్పే ప్రయత్నం నాగ్ అశ్విన్ చేయలేదు.ఈ విషయంలో ఆయన ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పాలి.

అనవసరమైన క్యామియోలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు నాగ్ అశ్విన్( Nag Ashwin ).అసలు ప్రతి పాత్రకి ఎలాంటి అర్థం లేకుండానే వచ్చాయి. హీరోయిన్ తో సహా ఈ చిత్రంలో చాలా మంది పాత్రలకు సరైన తీరుతెన్ను ఉండవు.

అలాగే శంభాల, కాశి, కాంప్లెక్స్ అనే ఈ ప్రపంచాల పై క్లారిటీ ఇవ్వలేదు.ఏమి ఎందుకు వస్తున్నాయో కూడా జనాలకు అర్థం కావు.కేవలం ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సీన్స్ మాత్రమే చిత్రాన్ని సేవ్ చేశాయి అనుకోవచ్చు.

తాజా వార్తలు