సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ తమదైన రీతిలో సినిమాలు చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందిన ప్రభుదేవా( Prabhu Deva ) మాస్టర్ డైరెక్టర్ గా మారి నువ్వువస్తానంటే నేనొద్దంటానా సినిమా చేశాడు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆ తర్వాత చాలా సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు.

అయినప్పటికీ ఆయనకి ఇప్పటివరకు ఒక మంచి హిట్ సినిమా అయితే పడలేదు.ఇక దానికి తగ్గట్టుగానే తెలుగు సినిమాలు హిందీలో, హిందీ సినిమాలు తమిళ్ లో, తమిళ్ సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తూ వస్తున్నాడు.ఇదే క్రమంలో ఇంతకుముందు ప్రభాస్ తో పౌర్ణమి( Pournami ) అనే సినిమా చేశాడు.ఆ సినిమా డిజాస్టర్ గా మారింది.ఇక దాంతో ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి ప్రభుదేవా భారీ ప్లాన్ అయితే వేస్తున్నాడు.ఇక దానికి సంబంధించిన కథ చర్చలను కూడా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే ప్రభాస్ కి ప్రభుదేవా ఒక కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఆ కథ ఆయనకి నచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.కాకపోతే ప్రభాస్ ఇప్పుడున్న కమిట్ మెంట్స్ మొత్తం పూర్తి చేసుకోవడానికి రెండు సంవత్సరాలు పడుతుంది.కాబట్టి వీళ్ళ కాంబినేషన్ తెరకెక్కలంటే ఇంకా రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సినట్టు గా తెలుస్తుంది.
ఇక దీంతో ప్రభుదేవా ఒక వంతుకు సంతోషంగా ఉండగ ప్రభాస్( Prabhas ) ఫ్యాన్స్ మాత్రం మళ్లీ ప్రభుదేవా తో సినిమా ఎందుకు చేస్తున్నాడు అంటూ చాలా ఇబ్బందికి గురవుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ న్యూస్ ఇంకా అఫిషియల్ గా బయటికి రాలేదు కానీ తొందర్లోనే దీన్ని అనౌన్స్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…
.







