యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”సలార్”.ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.
హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.
కాగా ఈ సినిమాపై ఇప్పటికే మేకర్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎన్నో రోజుల ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించే సమయం ఆసన్నం అయ్యింది.
ఈ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది.
క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.ఈ క్రమంలోనే ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యి 10 రోజులు అవుతున్న మరో అప్డేట్ ఇవ్వలేదు.అందుకే మేకర్స్ తీరు డార్లింగ్ ఫ్యా( Prabhas )న్స్ కు నచ్చడం లేదట.
మేకర్స్ విషయంలో ఫ్యాన్స్ పూర్తిగా డిజప్పాయింట్ గా ఉన్నారని తెలుస్తుంది.సినిమా రిలీజ్ కు కేవలం 10 రోజులే ఉన్నప్పటికీ అసలు సలార్ హడావిడి ఎక్కడ కనిపించడం లేదు.
అసలు ప్రమోషన్స్ లేకుండా ఫ్యాన్స్ కు నిరుత్సాహం కలిగేలా చేస్తున్నారు.మరి కారణం ఏంటో తెలియదు కానీ మేకర్స్ పద్ధతి అందరికి షాకింగ్ గా అనిపిస్తుంది.చూడాలి ఈ మూవీ ప్రమోషన్స్ ను ఇప్పటికైనా యాక్టివ్ గా చేసి అంచనాలను పెంచేస్తారా లేదంటే ఇంతే చప్పగా ముగిస్తారో.