Prabhas Yogi Re Release : థియేటర్ లో బీభత్సం సృష్టించిన ప్రభాస్ ఫ్యాన్స్.. స్క్రీన్ చింపి ఆపై?

మామూలుగా అభిమానులు వారి అభిమాన హీరోల సినిమాలు రిలీజ్( Movie Release ) అవుతున్నాయంటే థియేటర్ల వద్ద చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సినిమా విడుదల అవుతుంది అన్న అత్సుస్సాహంతో ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియకుండా చేస్తుంటారు.

కొన్ని కొన్ని సార్లు థియేటర్ యాజమాన్యానికి పక్కవారికి ఇబ్బంది కలిగే విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు.సినిమా హాల్లో అయితే అభిమానుల హంగామా సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.

సినిమా విడుదలైన మొదటి రోజు సినిమా హాల్ కి వెళ్తే సినిమా చూడడానికి అసలు ఉండదని అంటూ ఉంటారు.

ఆ రేంజ్ లో బీభత్సాలను సృష్టిస్తూ ఉంటారు.ఈ మధ్యకాలంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నారు అభిమానులు.

Advertisement

దీంతో సదరు హీరోలకు చెడ్డపేరు తెస్తున్నారు.స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్( Re Release ) ల సమయంలో అభిమానులు రెచ్చిపోయి టపాసులు కాలుస్తూ తెరలకి మంటలు అంటిస్తూ థియేటర్ అద్దాలను రాళ్లతో బద్దలు కొడుతూ, కూర్చులని విరగ్గొడుతూ నానా రచ్చ చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తుండడంతో థియేటర్ యాజమాన్యం భయపడుతున్నారు.కాగా తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) కూడా ఇలాంటి పనే చేశారు.

ప్రభాస్ నటించిన యోగి మూవీ రీ రిలీజ్( Yogi Movie Re Release ) అయిన విషయం తెలిసిందే.అయితే ప్రభాస్ ఫాన్స్ ఈ రోజు ఆగష్టు 18 న నంద్యాల రాజ్ థియేటర్ లో యోగి రీ రిలీజ్ సందర్బంగా సంబరాలు చేసుకుంటూ స్క్రీన్ దగ్గర డాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద పడగా థియేటర్ స్క్రీన్ రెండు చోట్ల చిరిగిపోయి బాగా డామేజ్ అయింది.ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం రాజ్ థియేటర్ స్క్రీన్( Raj Theatre Screen ) చిరిగిపోవడానికి కారణమైంది.

అభిమానులకి పిచ్చ ఉండొచ్చు.కానీ ఈ రకమైన వెర్రి ఉండడం కరెక్ట్ కాదని నెటిజెన్స్ కాస్త గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

దాంతో థియేటర్ యాజమాన్యం అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు