యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాతోనే రాజమౌళి పెద్ద డైరెక్టర్స్ లిస్టులో చేసరిపోయాడు ఎన్టీయార్ కూడా స్టార్ హీరోగా మారిపోయాడు…
అలా చాలా పెద్ద విజయం అందుకున్నఈ సినిమాలో మొదట ఎన్టీయార్ హీరో కాదంట, రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ స్టోరీ ని మొదట బాలకృష్ణ కి చెప్పారట అప్పటికే సమర సింహ రెడ్డి, నరసింహ నాయుడు లాంటి పవర్ఫుల్ సినిమాలు చేసిన బాలయ్య ఈ స్టోరీ కూడా అలాగే ఉంది అనుకొని ఈ సినిమాని రిజక్ట్ చేసాడట.ఆ తర్వాత రాజమౌళి ఈ స్టోరీ ని ప్రభాస్ కి చెప్పాడట

ప్రభాస్ ఈ స్టోరీ విని కొంచం టైం కావాలి అని అడిగాడట,దాంతో కొన్ని రోజులు వెయిట్ చేసిన రాజమౌళి ఇక ఎన్ని రోజులకి ప్రభాస్ నుంచి సమాధానం రాకపోవడంతో రాజమౌళి ఎన్టీయార్ తో ఈ సినిమా చేసి హిట్ కొట్టాడు.ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఛత్రపతి,బాహుబలి సిరీస్ వచ్చింది.కానీ సింహాద్రి సినిమాని మిస్ చేసుకున్నందుకు ప్రభాస్ ఇప్పటికి చాలా భాదపడుతుంటాడు…

సింహాద్రి సినిమాతో ఎన్టీయార్ కి ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 4 సినిమాలు కూడా సూపర్ హిట్స్ అనే చెప్పాలి.ఎన్టీయార్ ని స్టార్ హీరోని చేయడం లో రాజమౌళి పాత్ర చాలానే ఉంది అని చెప్పాలి…
.