యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నాడు.ఆ సినిమా చిత్రీకరణ జరుగుతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా యొక్క బడ్జెట్ మొదట అనుకున్నదానితో పోల్చితే భారీగా పెరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి.ప్రశాంత్ నీల్ తన కేజీఎఫ్ 2 తో వెయ్యి కోట్ల మార్కెట్ లో నిలిచాడు.
కేజీఎఫ్ తో వెయ్యి కోట్లకు పైగా హంబుల్ ఫిల్మ్స్ వారు లాభాలను సొంతం చేసుకున్నారట.అందుకే వారు ఇప్పుడు భారీ గా సలార్ కు ఖర్చు చేసేందుకు సిద్ధం అన్నట్లుగా ఉన్నారట.
అందుకే సలార్ సినిమాను మొదట అనుకున్న సమయంలో 250 కోట్ల రూపాయలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ముగించాలని భావించాడు.వంద కోట్ల రూపాయలు ప్రభాస్ కు రెమ్యూనరేషన్ కాగా 150 కోట్ల రూపాయలు సినిమా మేకింగ్ కోసం అన్నట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట.

కానీ కేజీఎఫ్ 2 సినిమా తర్వాత సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.కనుక 400 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తో సినిమాను రూపొందించాలని నిర్ణయించారట.అందుకు తగ్గట్లుగానే గతంలో షూట్ చేసిన సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారట.ప్రభాస్ వంద కోట్ల పారితోషికం తో పాటు ఇతర నటీ నటుల పారితోషికం మరో 75 కోట్లు పోను మిగిలిన మొత్తం సినిమా మేకింగ్ కు ఖర్చు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినీ చరిత్రలో సలార్ సినిమా యొక్క బడ్జెట్ ఒక రికార్డ్ అన్నట్లుగా నిలవడం ఖాయం అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.సలార్ తో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే యొక్క బడ్జెట్ భారీ ఎత్తున ఉండబోతుందని తెలుస్తోంది.







