ప్రభాస్‌, మారుతి సినిమా మరో ఇంట్రెస్టింగ్‌ రూమర్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.మొన్నటి వరకు ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

 Prabhas And Maruthi Movie Interesting New Update , Dvv Danayya, Film News,marut-TeluguStop.com

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అన్ని భాషలకు కామన్ గా ఉండే క్యాచీగా ఉండే విధంగా ఒక మంచి టైటిల్ ని ఎంపిక చేశారని, ఆ టైటిల్ ని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

మొదటి షెడ్యూల్ లో పది నుండి 15 రోజుల పాటు ప్రభాస్ మరియు కీలక నటీనటులపై చిత్రీకరించే అవకాశం ఉందట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పాడట.

 Prabhas And Maruthi Movie Interesting New Update , DVV Danayya, Film News,Marut-TeluguStop.com

ప్రభాస్ సినిమా అనగానే స్టోరీ లైన్ కూడా వినకుండానే సంజయ్ దత్ ఓకే చెప్పాడని టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

కేవలం తన పాత్ర ఏంటి అని మాత్రమే అడిగి సంజయ్ దత్ ఈ సినిమాకు ఓకే చెప్పాడట, సినిమా కోసం ఆయన భారీ పారితోషకం అందుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు మారారు అంటూ ప్రచారం జరుగుతుంది.మొన్నటి వరకు దానయ్య ఈ సినిమాను నిర్మిస్తాడు అనే ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు మరో నిర్మాత ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా మారినట్లు తెలుస్తుంది.నిర్మాత ఎవరు అనే విషయమై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి ఈ సినిమా కు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అంచనాలు పెంచేస్తుంది.ఆ మధ్య ప్రభాస్ అభిమానులు మారుతీతో ప్రభాస్ సినిమా వద్దు అంటూ సోషల్ మీడియాలో బాయికాట్ నినాదం చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు వాళ్లే ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందో.ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ముందు ముందు ఈ సినిమా మరింత ఆసక్తిని క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube