నెలలు పాటు ఖాళీగా ఉంటున్న హీరో.. అతను కథ సిద్ధం చేసుకోకపోవడమే కారణమా?

తెలుగు ప్రేక్షకులకు హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరో నితిన్ ఇటీవలే మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Nithin Is Taking Care Of The Directors Film Details, Nithin, Vakkamtham Vamsi, T-TeluguStop.com

గత ఏడాది రంగ్ దే,చెక్, మాస్ట్రో లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ సినిమాకు సంబంధించిన ఫుల్ ప్రూఫ్ తయారైన తరువాతే సినిమాను చేయడానికి రెడీ అంటున్నాడు.

అంతవరకు కూడా సినిమాకు దూరంగానే ఉంటున్నారు నితిన్.కాగా హీరో నితిన్ గతంలో వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను ఓకే చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా మరొక రెండు నెలలు ఆలస్యం కానుంది.నవంబర్ లో కూడా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా కనిపించడం లేదు.వక్కంతం వంశీ దాదాపు రెండేళ్లుగా ఈ స్క్రిప్టును ఇతర రైటర్ లను టీములు టీములుగా తీసుకుని స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.అయితే ఆ పని కూడా సంతృప్తిగా రావడం లేదేమో, దాదాపు నెల రోజులుగా హీరో నితిన్ ఖాళీగా వుండిపోయారు.

అక్టోబర్, నవంబర్ కూడా ఇలా ఖాళీగా వుండే అవకాశం వుందని తెలుస్తోంది.

Telugu Surender Reddy, Nithin, Nithin Latest, Script, Tollywood-Movie

ఇప్పటికే నెలరోజులపాటు ఖాళీగానే ఉన్న నితిన్ ఇప్పుడు మరొక రెండు నెలల పాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు రానున్నాయి.కాగా వంశీ ప్రస్తుతం స్క్రిప్ట్ పని టీమ్ కు అప్ప చెప్పి, వక్కంతం వంశీ ప్రీ ప్రొడక్షన్ పనుల మీద బిజీగా వున్నారు.ఈ సినిమాతో పాటు నితిన్ మరొక సినిమా కూడా ఓకే చెప్పారట.

ఆ సినిమా మరేదో కాదు సురేందర్ రెడ్డి తో సినిమా ఒకటి చేయాల్సి వుంది.అయితే మాచర్ల నియోజకవర్గం సినిమా ఊహించిన విధంగా ఫ్లాప్ అవడంతో స్క్రిప్ట్ ల విషయంలో నితిన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube