తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెరపై పలుచోలకు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు ఎక్కువ అవ్వడంతో ఇటీవలే జబర్దస్త్ షోకి కూడా గుడ్ బాయ్ చెప్పేసింది.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది అనసూయ.
ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త, పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే.
పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరగడంతో పాటు అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి.
ఈ సినిమాలతో పాటుగా సోగ్గాడే చిన్నినాయన, క్షణం, కథనం, యాత్ర, థాంక్యూ బ్రదర్, కిలాడీ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలాగే స్పెషల్ సాంగ్ లలో కూడా చిందులు వేసింది.
ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.అంతేకాకుండా రోజురోజుకీ తన అందాలను మరింత రెట్టింపు చేస్తూ తన అందంతో యువతని ఆకట్టుకుంటూ ఉంటుంది.

కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పంచుకుంటూనే ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేసింది.ఆ వీడియోలో ఆమె ఒక్కడు మూవీ సినిమాలోని ఏం మాయ చేసావో గానే అనే పాటకు తన పైటను ఎగురవేసి మరి డాన్స్ వేసింది.దీంతో ఈమెను నెటిజన్స్ ట్రోల్లింగ్ చేస్తూ ఒక ఆట ఆడుకుంటున్నారు.
ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.








