ప్రభాస్, మారుతి కాంబో సినిమాకు నిర్మాతలు వాళ్లే.. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

Prabhas And Maruthi Film Production House Update , Prabhas, Maruthi Film, Flim News, News In Telugu, Peoples Media Factory, Top News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా నిర్మాతలు ఎవరు అనే విషయం గత కొన్నాళ్లుగా క్లారిటీ లేదు.గతం లో ఒక సారి మేము పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమా ను నిర్మిస్తున్నారని పేర్కొన్నాము.

 Prabhas And Maruthi Film Production House Update , Prabhas, Maruthi Film, Flim N-TeluguStop.com

ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడం తో అభిమానులతో పాటు ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారు.మొదట దానయ్య వీరి కాంబినేషన్ సినిమా ను నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

అది నిజం కాదని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో ప్రభాస్ హీరో గా మారుతీ దర్శకత్వం లో సినిమా ను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ విషయం నిరూపితమైంది.

Telugu Maruthi, Telugu, Peoples Factory, Prabhas, Top-Movie

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా విజయోత్సవ వేడుక పీపుల్స్ మీడియా వారి ఆఫీసు లో జరిగింది.రవితేజ తో పాటు ధమాకా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ పార్టీ లో ప్రభాస్ మరియు మారుతి లు కూడా ఈ పార్టీ లో పాల్గొన్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీసు లో ప్రభాస్ సందడి చేసిన వీడియో లు మరియు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

పీపుల్స్ మీడియా వారు ప్రభాస్ కి సుస్వాగతం అంటూ ఒక ఫ్లెక్సీ ని కూడా ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.కేవలం పీపుల్స్ మీడియా వారి బ్యానర్‌ లో నటిస్తున్న కారణంగానే ప్రభాస్ ధమాకా సినిమా యొక్క సక్సెస్ పార్టీకి హాజరయ్యారని తెలుస్తోంది.

ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ సినిమా రెండవ షెడ్యూల్ ప్రారంభానికి సిద్ధమవుతోంది.మీడియా వారు ఈ సినిమా యొక్క అధికారిక ప్రకటన ఉగాది కి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube