వామ్మో.. పవన్ లుక్ లో ఇంత మార్పా.. కాలేజ్ కుర్రాడిలా ఉన్నాడంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.

పవన్ నటించిన సినిమా విడుదలైతే తొలిరోజు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ కావాల్సిందేననే సంగతి తెలిసిందే.

కొన్నిరోజుల క్రితం వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కోసం తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు.కాలేజ్ కుర్రాడిలా పవన్ కళ్యాణ్ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

పవన్ కళ్యాణ్, కీరవాణి కలిసి ఫోటో దిగగా మీ పక్కన ఉన్న కుర్రాడు ఎవరు సార్ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేయడం గమనార్హం.మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోంది.

పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ఏఎం రత్నం నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

Advertisement

అక్టోబర్ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.లుక్ మార్చుకున్న పవన్ కళ్యాణ్ తన కొత్త లుక్ తో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.

నవ రాత్రులలో నవ ఉత్తేజం అంటూ కీరవాణి పవన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన పవర్ గ్లాన్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.హరిహర వీరమల్లు సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ వినోదాయ సిత్తం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలలో ఏ సినిమా మొదట రిలీజవుతుందో చూడాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు