పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) సంబంధించిన టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ యూట్యూబ్ రికార్డు స్థాయి వ్యూస్ మరియు లైక్స్ రప్పించడం ఆయన ఫ్యాన్స్ కి అలవాటు.ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్ మరియు ట్రైలర్స్ రికార్డ్స్ లిస్ట్ తీస్తే అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రికార్డ్స్ ఎక్కువ ఉంటుంది.
ముఖ్యంగా లైక్స్ విషయం లో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి దగ్గర్లో వచ్చిన హీరో నే లేదు.ఇప్పుడు రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘బ్రో’ మూవీ కి( Bro Movie ) సంబంధించి మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు.
దీనికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.శివ శ్లోకం తో మ్యూజిక్ డైరెక్టర్ థమన్( Music Director Thaman ) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి రెస్పాన్స్ అదిరిపోయింది.
మామూలు కంటెంట్ ని కూడా తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లే టాలెంట్ ఉన్న థమన్, ఈ మోషన్ పోస్టర్ కి కూడా అదే రేంజ్ లో పని చేసాడు.

ఈ మోషన్ పోస్టర్ కి సోషల్ మీడియా మొత్తం కలిపి 11 మిలియన్ వ్యూస్ వచ్చాయట.అందులో 5 మిలియన్ కి పైగా వ్యూస్ ఇంస్టాగ్రామ్ నుండి రాగా, 6 మిలియన్ కి పైగా వ్యూస్ యూట్యూబ్ నుండి వచ్చాయి.ఇది కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, సౌత్ ఇండియా లోనే ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు.
ఇప్పటి వరకు సౌత్ లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్ తమిళ హీరో అజిత్ నటించిన వలిమై చిత్రం( Valimai Movie ) ఖాతాలో ఉంది.ఈ మోషన్ పోస్టర్ కి 24 గంటల్లో 5.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.కానీ బ్రో మోషన్ పోస్టర్ కి 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఇక టాలీవుడ్ లో నిన్న మొన్నటి వరకు అత్యధిక వ్యూస్ ని సాధించిన మోషన్ పోస్టర్ గా ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చిత్రం ఉండేది.ఈ మోషన్ పోస్టర్ కి అప్పట్లో దాదాపుగా 4.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రానికి 4.6 మిలియన్ వ్యూస్ రాగా, విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రానికి 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మోషన్ పోస్టర్ కి 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.అయితే వ్యూస్ విషయం లో ఆల్ టైం టాప్ 1 గా నిల్చిన ‘బ్రో’ మోషన్ టీజర్, లైక్స్ పరంగా మాత్రం టాప్ 5 లో నిల్చింది.కేవలం మోషన్ పోస్టర్ తోనే ఈ రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తే, ఇక జులై 28 వ తారీఖున విడుదల అవ్వబోయే సినిమాతో ఇంకెన్ని రికార్డ్స్ సృష్టించబోతున్నాడో అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటి నుండి లెక్కలు వేస్తున్నారు.
తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.







