పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పూనమ్ అనే పోలీస్ జాగిలం శుక్రవారం తుది శ్వాస విడిచింది

2010వ సంవత్సరం నుంచి పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న (explosive dog) పూనమ్ అనే పోలీస్ జాగిలం శుక్రవారం తుది శ్వాస విడిచింది.13 ఏళ్ల పూనమ్ పోలీస్ శాఖలో అనేక క్లిష్టమైన కేసులను ఛేదించడంలో కీలక భూమిక పోషించింది.ఈ క్రమంలో పూనమ్ మృతితో పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకోగా శుక్రవారం నాడు పోలీస్ కమిషనర్ విష్ణు యస్ .వారియర్ ( Vishnu S Warrier ) పోలీసులు పోలీస్ లాంఛనాల పూనమ్ అంత్యక్రియలు నిర్వహించారు.

 Poonam, A Explosive Dog Working In The Police Department, Breathed Her Last On F-TeluguStop.com

పూనమ్ అనే ఈ ఫిమేల్ పోలీసు జాగిలం 2010లో పోలీస్ ఫోర్స్( Police Force ) లో చేరింది .శిక్షణలోనే గోల్డ్ మెడల్ సాధించింది.2011లో చర్ల కూబింగ్ ఆపరేషన్ లో నాలుగు మందు పాత్రలను వెలికితీసింది.2014 లో భద్రాచలం ( Bhadrachalam )బస్‌స్టాండు లో పేలుడు పదార్థాలను కనుగొన్నది.పోలీస్ ఆర్సీ కోర్సులో నలుగు బంగారు పతకాలు సాధించిన ఘనత పూనమ్ కు వుంది.ప్రాథమిక కోర్సును పూర్తి చేసింది.పోలీసు జాగిలాలకు ఇచ్చే ప్రాథమిక కోర్సు కోసం శిక్షణ సమయంలో పూనమ్ మెదటి స్థానంలో నిలిచిందని డాగ్ హ్యాండ్లర్ షేక్ పాషా తెలిపారు.కార్యక్రమంలో AR అడిషనల్ డీసీపీ కుమారస్వామి( DCP Kumaraswamy ), RI లు రవి, శ్రీనివాస్ ,తిరుపతి,శ్రీశైలం పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube