ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు ట్రెండ్ కొనసాగుతుండడంతో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు.అనుకోవడం బాగానే ఉంది కానీ కేవలం కొంతమంది హీరోలు మాత్రమే సక్సెస్ ను సాధిస్తున్నారు.
అయితే నిద్రలో కూడా పాన్ ఇండియా సినిమాల పేరును కలవరిస్తున్న మా టాలీవుడ్ హీరోలకు హీరో బెల్లంకొండ శ్రీనివాస్( Bellamkonda Sai Sreenivas ) రూపంలో పెద్ద గుణపాఠం తెలిసి వచ్చింది.కాగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కొన్ని సినిమాలకు యూట్యూబ్ లో విపరీతంగా పాపులారిటీ వచ్చింది.

మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.దీంతో బెల్లంకొండ నటించిన సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో భారీగా డబ్బులు వచ్చాయి.ఇవన్నీ చూసిన బెల్లంకొండ, తనకు బాలీవుడ్ లో క్రేజ్ ఉందని భ్రమపడ్డాడు.దాంతో అనుకున్నదే ఆలస్యం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి( Chatrapathi ) సినిమాను హిందీలో అదే పేరుతో రీమేక్ చేశాడు.
కానీ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.అంతేకాకుండా ఈ సినిమా బాలీవుడ్ చరిత్రలో( Bollywood ) నే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
పట్టుమని కోటి రూపాయల కలెక్షన్ కూడా రాలేదని తెలుస్తోంది.

ఈ దెబ్బతో తిరిగి తెలుగు సినిమాల వైపు వచ్చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్.మంచి కథ ఎంచుకొని, భారీ బడ్జెట్ తో చాలామంది సినిమాలు తీస్తారు.కానీ దానికి ప్లాన్డ్ గా ప్రచారం చేయడం కూడా ఎంతో ముఖ్యం.
ఈ విషయంలో హిందీ ఛత్రపతి యూనిట్ వెనకబడింది తెలుస్తోంది.అయితే చిత్ర యూనిట్ కేవలం ఉన్నంతలో కొన్ని నగరాలు కవర్ చేసినప్పటికీ, బజ్ వచ్చేలా మూవీకి ప్రచారం కల్పించలేకపోయారు.
దీనికి తోడు ఔట్ డేటెడ్ కంటెంట్ ను ఈ తరానికి ఎక్కించాలనే ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది.కేవలం బెల్లంకొండ సినిమాలకే కాదు యూట్యూబ్ లో బాలకృష్ణ, రామ్ లాంటి హీరోల సినిమాలకు కూడా మంచి వ్యూస్ ఉన్నాయి.
కానీ ఆ క్రేజ్ తో నేరుగా బాలీవుడ్ లో సినిమా తీస్తే ఏమౌతుందో, బెల్లంకొండ ఉదంతంతో అంతా తెలుసుకున్నారు.







