అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వేస్టేషన్ లో రైల్వే ప్రయాణికులు నిరసనకు దిగారు.విశాఖ నుంచి తిరుమల వెళ్తున్న ట్రైన్ లో సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైలులో ఏసీ పని చేయడం లేదని యలమంచిలి రైల్వేస్టేషన్ లో రైలు ఆపి ఫ్లాట్ ఫామ్ పై ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఏసీ టికెట్ ధర తీసుకుని కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు.
ఇదేమిటని ప్రశ్నిస్తే రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో రైలు చాలా సేపు నిలిచిపోయింది.







