నంది అవార్డుల గురించి పోసాని కీలక వ్యాఖ్యలు... వారికే ఇస్తామంటూ కామెంట్స్?

ఏపీ స్టేట్ ఫిలిండెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) తాజాగా నంది అవార్డ్స్( Nandi Awards ) గురించి స్పందించారు.గతంలో నంది అవార్డుల గురించి ఈయన మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.

 Key Comments About Nandi Awards, Posani Krishna Murali , Nandi Awards , Ycp, Ja-TeluguStop.com

నంది అవార్డులు అంటే కమ్మ అవార్డులు అంటూ ఈయన ఆరోపణలు చేశారు.ఒక్కో కాంపౌండ్ కు రెండు మూడు నదులు వెళ్లాయని పోసాని తీవ్రస్థాయిలో నంది అవార్డుల గురించి ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించబోతున్నారని దీనికోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Telugu Nandi Awards, Posanikrishna, Vijay Kumar-Movie

ఈ క్రమంలోనే ఈ నంది అవార్డుల గురించి నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy )నిజాయితీగా నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పినట్లు తెలిపారు.అయితే ఈ నంది అవార్డులు డ్రామా, టీవీ, సినిమా ఈ మూడు రంగాలకు ఒకేసారి ఇవ్వడం కుదరదు కనుక ముందుగా నాటక రంగానికి నంది అవార్డులను ప్రకటించబోతున్నట్లు తెలియజేశారు.

Telugu Nandi Awards, Posanikrishna, Vijay Kumar-Movie

ఇక మేము నంది అవార్డులను ఉత్తములకు అర్హులకు మాత్రమే ఇస్తాము రాష్ట్రంలో ఎవరైనా ఉచితంగా షూటింగులు చేసుకోవచ్చు.స్టూడియోలు కట్టినా సహకరిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోని ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నాటక రంగానికి సంబంధించి నంది అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి నెలరోజుల పాటు సమయం ఉంటుందని తెలిపారు.ఉపసంహరణకు నెల రోజులు గడువు ఉంటుందని ఐదు క్యాటగిరిలలో పోటీ ఉండగా 73 అవార్డులు ఉంటాయని ఈ సందర్భంగా విజయ్ కుమార్ నంది అవార్డుల నోటిఫికేషన్ గురించి తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube