సినిమా ఇండస్ట్రీ లో ఈ మధ్య వరుస మరణాలు సంభవిస్తున్నాయి…ప్రముఖ కమెడియన్ మనోబాల( Comedian Manobala ) కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
తమిళ్ తో పాటుగా తెలుగు ప్రేక్షకలను కూడా మనోబాల తనదైన నటనతో అలరించారు.తెలుగులో ఆయన మహానటి, దేవదాసు, రాజ్‌దూత్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించారు.1970ల్లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మనోబాల.1979లో భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా మారారు.1982లో వచ్చిన అగయ గంగయ్ సినిమాతో దర్శకుడిగా మారారు.

ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రెండు మూడు చిత్రాల్లో నటించారు.దర్శకుడుగా చేస్తూనే నటుడిగా మారాడు .2000 సంవత్సరంలో హాస్య నటుడిగా( Comedian ) మారిన మనో బాల.ఇప్పటి వరకు 700కు పైగా చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను నవ్వించగలిగారు.ముఖ్యంగా వివేక్, వడివేలు కాంబినేషన్‌లో మనోబాల కామెడీ ట్రాక్‌కు మంచి పేరొచ్చింది.దర్శకుడిగానూ 20కి పైగా చిత్రాలను తెరకెక్కించారు.మూడు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.దాదాపు 350 సినిమాల్లో సహాయ నటుడిను గా మెప్పించారు.

దిగ్గజ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు.పలు సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు.ఇక కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోబాల జనవరిలో యాంజియో చికిత్స చేయించుకున్నారు.అప్పటి నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు .తాజాగా ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు .మనోబాల మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అయన మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.








