తెలుగులో తక్కువ సినిమాలే చేసినా పూర్ణకు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.పలు రియాలిటీ షోలకు పూర్ణ జడ్జిగా కూడా వ్యవహరించారు.
తాజాగా పూర్ణ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.పూర్ణ వైవాహిక జీవితానికి సంబంధించి గతంలో పలు వార్తలు ప్రచరంలోకి రాగా పూర్ణ ఆ వార్తలకు చెక్ పెట్టారు.
పూర్ణకు ఆమె భర్త ఏకంగా 170 తులాల బంగారం కానుకగా ఇచ్చారని ఇచ్చారని తెలుస్తోంది.ఈ విషయం తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.పూర్ణకు భర్తపై ఎంత ప్రేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.బంగారంతో పాటు లగ్జరీ విల్లాను పూర్ణకు ఆమె భర్త బహుమతిగా ఇచ్చారని సమాచారం అందుతోంది.
జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ అయిన అసిఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకున్నారు.

దుబాయ్ లోని ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పూర్ణ పెళ్లి జరగడం గమనార్హం.ముస్లిం సాంప్రదాయ విధానంలో పూర్ణ పెళ్లి జరిగిందని తెలుస్తోంది.పూర్ణ కలకాలం అన్యోన్యంగా జీవనం సాగించాలని మరి కొందరు సూచనలు చేస్తుండటం గమనార్హం.
పూర్ణ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పెళ్లి తర్వాత పూర్ణ కెరీర్ విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.సినిమాసినిమాకు పూర్ణ రేంజ్ పెరుగుతుండగా పూర్ణ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.పూర్ణ పారితోషికం కూడా భారీ రేంజ్ లోనే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కెరీర్ విషయంలో పూర్ణ ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.పూర్ణకు సోషల్ మీడియాలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.