వైరల్: 125 ఐస్‌ స్కూప్‌లు ఒకే కోన్‌పై పెట్టేసాడు.. దెబ్బకి గిన్నిస్‌ రికార్డు బద్దలైంది!

సోషల్ మీడియాలో కాస్త ఆసక్తికరంగా కనిపించిన వీడియో అప్లోడ్ అయితే చాలు.నెటిజన్లు షేర్లు మీద షేర్లు చేసేస్తున్నారు.

 Viral: He Put 125 Ice Scoops On A Single Cone The Guinness Record Was Broken , V-TeluguStop.com

దాంతో సదరు వీడియోలు వైరల్ అవుతుంటాయి.తాజాగా అలాంటి అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.

బేసిగ్గా ఒక కోన్‌పై ఒకే ఐస్ స్కూప్‌ మాత్రమే పెడతారు.కొన్నిసార్లు కస్టమర్‌ కోరిక మేరకు రెండు, మూడు పెట్టిన సందర్భాలుంటాయి.

కానీ, ఒకే కోన్‌పై ఏకంగా 125 ఐస్ స్కూప్‌లను పెట్టాడొక ఔత్సాహికుడు.అసలు ఇది సాధ్యమేనా అని అనుమానం కలుగుతోంది కదూ.

ఆశ్చర్యపోయినా మీరు విన్నది నిజమే.వివరాల్లోకి వెళితే, ఇటలీకి చెందిన దిమిత్రీ పాన్‌సియేరా అనే వ్యక్తి గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించడం కోసం పెద్ద సాహసమే చేసాడు.

పాన్‌సియేరా.అందరూ చూస్తుండగానే ఒకే కోన్‌పై రంగురంగుల ఐస్‌ స్కూప్‌లను ఒకదానిపై ఒకటి పొందికగా అమర్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు.

దానికి సంబంధించిన విజువల్స్ మీరు చాలా క్లియర్ గా చూడవచ్చు.దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌వరల్డ్‌ రికార్డు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

కాగా ఈ వీడియో కంటెంట్ ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తుండటం విశేషం.అనేకమంది దీనిని షేర్ చేయగా, వేలమంది దీనిని లైక్ చేస్తున్నారు.“ఐస్‌క్రీం అంటే ఆ మాత్రం సైజుండాలి మరి” అని ఒకరెంటే, “ఈ రికార్డును ఇంకా బ్రేక్‌ చేసేదెవరు?” అని మరొకరు, “ఇంతకీ దీన్ని తినేదెవరు?” అంటూ ఎవరికి నచ్చిన రీతిలో వారు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube