చరణ్ గురించి ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూల ద్వారా, సోషల్ మీడియా ద్వారా పూనమ్ కౌర్ పేరు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.పేర్లు ప్రస్తావించకుండా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసే పోస్టుల గురించి అభిమానుల మధ్య చాలా సందర్భాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

 Poonam Kaur Shocking Comments About Charan Details, Poonam Kaur, Ram Charan, Nat-TeluguStop.com

ప్రభాస్, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్ తాజాగా ఇతర హీరోల గురించి చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

నాతిచరామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూనమ్ కౌర్ బాల్యం నుంచే తనకు మూవీ ఆఫర్లు ఎక్కువ సంఖ్యలో వచ్చాయని అయితే కుటుంబ సభ్యులకు ఇష్టం లేదనే కారణం వల్ల తాను ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించానని ఆమె చెప్పుకొచ్చారు.

విజయ్ దేవరకొండ మూవీలో తనకు ఛాన్స్ వచ్చిందని అయితే ఆ ఆఫర్ ను తాను వదులుకున్నానని పూనమ్ కౌర్ వెల్లడించారు.సినిమాల్లోకి అనుకోకుండా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నానని ఆమె అన్నారు.

సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్న తరుణంలో నా దగ్గరకు నాతిచరామి స్క్రిప్ట్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Chiranjeevi, Nagarjuna, Pawan Kalyan, Poonam Kaur, Poonamkaur, Prabhas, R

ఫ్రెండ్స్ ఆ స్క్రిప్ట్ లో కచ్చితంగా నటించాలని కోరగా కథ నచ్చడంతో సినిమాకు ఓకే చేశానని ఆమె వెల్లడించారు.టాలీవుడ్ హీరో నాగార్జున అందంగా ఉంటారని ఉత్సాహంగా కనిపిస్తారని ఆమె అన్నారు.మా ఫ్యామిలీకి చిరంజీవి ఇష్టమని బాల్యంలో నాన్న మెగాస్టార్ సినిమాలకు ఎక్కువగా తీసుకెళ్లేవారని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Chiranjeevi, Nagarjuna, Pawan Kalyan, Poonam Kaur, Poonamkaur, Prabhas, R

రామ్ చరణ్ గురించి ఎన్నో విషయాలను చెప్పాలని ఉందని అయితే ఇప్పుడు ఆ విషయాలను తాను చెప్పాలనుకోవడం లేదని పూనమ్ కౌర్ పేర్కొన్నారు.చరణ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని పూనమ్ కౌర్ అన్నారు.పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube