ఇటీవల కాలంలో ఎంత ప్రొమోషన్ చేస్తే ఆ సినిమాకు అంత ఓపెనింగ్స్ వస్తున్నాయి.ఓపెనింగ్స్ సినిమాకు చాలా కీలకం.
అందుకే సినిమా రిలీజ్ ముందే ఆ సినిమాపై భారీ హైప్ పెంచుతున్నారు.ఇక పాన్ ఇండియా సినిమా అయితే మరిన్ని ప్రొమోషన్స్ చేసి ప్రేక్షకులను థియేటర్ దగ్గరకి తీసుకురావాలి అందుకే ప్రొమోషన్స్ అస్సలు మిస్ చేయడం లేదు మేకర్స్.
ఇక ఇప్పుడు మన టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది.ఈ సినిమా ప్రొమోషన్స్ కూడా జక్కన్న ఓ రేంజ్ లో చేయాలని ప్లాన్ చేసాడు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా విడుదల చేయాలనీ చూసినప్పుడల్లా ఏదొక సమస్య వస్తూనే ఉంది.పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ కానుందని ఇటీవలే ప్రకటించారు.
ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం అయ్యిందని తెలుస్తుంది.ఈ నెల 19న గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇప్పటికే మేకర్స్ ద్రుష్టి సారించారు.
బుర్జ్ ఖలీఫా లో ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.ఈ ఈవెంట్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉండబోతుందని టాక్.
అయితే ఈ ఈవెంట్ ఈ సినిమా ప్రొమోషన్ కే కీలకం అని అందుకే రాజమౌళి మరింత సీరియస్ గా దీనిపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

అయితే ఈ దుబాయ్ ఈవెంట్ ప్లాన్ లో ప్రభాస్ హస్తం ఉందట.ప్రభాస్ ఇచ్చిన ఐడియా వల్లనే అక్కడ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేసాడట జక్కన్న.రాజమౌళికి ఈ ఐడియా ప్రభాస్ ఇవ్వడంతో ఆయన అత్యంత గ్రాండ్ గా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట.
మరి చూడాలి ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో.








