సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిగా నటిస్తూ గుర్తింపు పొందినటువంటి నటి పూనమ్ కౌర్ ( Poonam Kaur ) సినిమాలలో నటిస్తూ గుర్తింపు సంపాదించుకోవడం కన్నా సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి.ఈమె సోషల్ మీడియా వేదికగా ఇండైరెక్టుగా పోస్టులు చేస్తూ అసలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనే విషయం కూడా తెలియకుండా పలువురిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చేసే పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి ముఖ్యంగా ఈమె పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ద్వారా పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ వివాదం ఎప్పుడు కూడా ఈమె స్పందించిన దాఖలాలు లేవు.
![Telugu Pawankalyan, Poonam Kaur, Tollywood-Movie Telugu Pawankalyan, Poonam Kaur, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/09/Poonam-kaur-Sensational-comments-about-politicsb.jpg)
ఇక ఈమె కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.ఇక చేనేత కార్మికుల కోసం పూనమ్ రాజ్యసభ సభ్యులను కలుస్తూ వారికి అండగా ఉండడానికి తన వంతు సహాయం చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ఒక పోస్ట్ వైరల్ గా మారింది.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.ఇప్పటివరకు నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు అలాగే ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధాలు లేవు.
![Telugu Pawankalyan, Poonam Kaur, Tollywood-Movie Telugu Pawankalyan, Poonam Kaur, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/09/Poonam-kaur-Sensational-comments-about-politicsc.jpg)
ఇక పోతే కొందరు రాజకీయ నాయకులు( Politicians ) వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం నన్ను పావుగా వాడుకున్నారని నా పట్ల వికృత చేష్టలు చేస్తూ పైశాచిక ఆనందం పొందారని ఈమె తెలిపారు.ఒక మహిళ పట్ల ఇలాంటి కుట్రలు తగవు.సానుభూతి పేరుతో నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు.
నేను సిక్కు బిడ్డను.పోరాటాలు చేయడం నాకు తెలుసు దయచేసి నన్ను మీ రాజకీయాలలోకి లాగకండి.
ఇక తాను మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తాను.ఇక నా నుంచి ఏదైనా తెలియచేయాలి అనుకుంటే స్వయంగా ఆ విషయాలను నేనే తెలియజేస్తాను కానీ ఎవరు నన్ను రాజకీయాలలోకి లాగొద్దు అంటూ ఈ సందర్భంగా పూనమ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.