సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలి అన్నా, రాణించాలి అన్న కేవలం అందం అభినయం మాత్రమే సరిపోదు.కాస్త అదృష్టం కూడా ఉండాలి.
ఎందుకంటే కొంతమంది హీరోయిన్ లు అదృష్టం లేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇంకొంత మంది హీరోయిన్ లు కొద్దిరోజుల పాటు సినిమాలు నటించి ఆ తర్వాత ఇండస్ట్రీ కి దూరం అయ్యారు.
అలా ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సరైన అవకాశాలు లేకపోవడంతో కనుమరుగైపోయారు.అలాంటి వారిలో నటి పూనమ్ బజ్వా కూడా ఒకరు.
ఈమె టాలీవుడ్ లో మొదటి సినిమా అనే సినిమాతో తన కెరీర్ను ప్రారంభించింది.
ఆ తరువాత బాస్, పరుగు సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది.
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈమె కూడా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుందని అందరూ భావించారు.కానీ ఎవరూ ఊహించని విధంగా సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
అలా పూనమ్బజ్వా నిదానంగా వెండితెరకు దూరం అయింది.తెలుగు ఇండస్ట్రీకి బాయ్ బాయ్ చెప్పిన తర్వాత తమిళం మలయాళం, కన్నడ లలో సినిమాలు చేస్తూ వచ్చింది.
ఆ తర్వాత కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడు గురుమూర్తి అనే సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలు నటరాజ్ హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాకు కేటి ధనశేఖర్ దర్శకత్వం వహించగా ఫ్రెండ్స్ టాకీస్ పతాకంపై శివ చలపతి, సాయి శరవణన్ నిర్మించారు.
ఒక నిజాయితీపరుడైన పోలీసు అధికారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఇలా అధిగమించి తన నిజాయితీని నిరూపించుకున్నారు? ఇలాంటి ఆసక్తికర కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది దర్శకుడు తెలిపారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.