తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ రసవత్తరంగా సాగుతోంది.బిగ్ బాస్ లో ప్రేమలు,అనుబంధాల విషయాలు పక్కన పెడితే కొట్లాటలు, బూతులకు, కయ్యాలకు మాత్రం కొదవే లేకుండాపోయింది.
వారియర్స్, చాలెంజర్స్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది.అంతేకాకుండా వీరు రోజురోజుకీ బద్ద శత్రువుల్లా తయారవుతున్నారు.
కంటెస్టెంట్ లు ఆపోజిట్ టీమ్ కంటెస్టెంట్ లపై గొడవలకు దిగుతున్నారు.కొట్టుకునే స్థాయి వరకు కూడా వెళుతున్నారు.
అంతేకాకుండా బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ని ఎవరికి నచ్చిన విధంగా వారు ఆటలు ఆడుతున్నారు.
ఇంకొందరు అయితే బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ని పాటించడంలేదు అంటూ ఆపోజిట్ టీం కంటెస్టెంట్ లపై విరుచుకుపడుతున్నారు.
చాలెంజర్స్ బిగ్ బాస్ రూల్స్ ని అధిగమిస్తున్నారు అంటూ వారియర్స్ అసహనానికి లోనయ్యారు.ఇక వాళ్లు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఆడితే, బిగ్ బాస్ సరైన తీర్పు ఇవ్వకపోతే తాను కూడా రూల్స్ ఫాలో కాను అని తేల్చి చెప్పేశాడు అఖిల్ సార్థక్.
ఇక టాస్క్ లో భాగంగా మహేష్ విట్టా అనిల్ ను అరే అని అనడంతో అనిల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు.అరేయ్ గిరేయ్ అంటే నేను పడే అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
మొత్తానికి టాస్క్ లో భాగంగా ఛాలెంజర్స్ గెలిచినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

మరొకవైపు నట్రాజ్ మాస్టర్ ఎంత కష్టపడి ఆడినప్పటికీ ఫలితం దక్కలేదు అని కంటతడి పెట్టుకున్నాడు.మరొక పక్క మిత్రశర్మ చాలెంజర్స్ లో తనను చివరి వ్యక్తిగా చూస్తున్నారు అంటూ బోరున ఏడ్చేసింది.ఇక మొదటి వారంలో హౌస్ కెప్టెన్ గా వారియర్స్ టీమ్ నుంచి తేజస్వి ఎంపిక అయిన విషయం తెలిసిందే.
రెండవ వారం ఎవరు కెప్టెన్ గా అవుతారు అని బిగ్ బాస్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల మేరకు ఇక రెండవ వారం హౌస్ కెప్టెన్ గా అనిల్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







