టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట ఏం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది.
ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా హోదా ని తెచ్చుకుంది.అనంతరం నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుని కొద్దికాలం పాటు వైవాహిక జీవితాన్ని గడిపిన ఈ జంట గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించారు.
విడాకుల తర్వాత సమంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం ఏదో ఒక వార్తతో సమంతా సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.
అంతే కాకుండా విడాకుల తర్వాత సమంత ఎటువంటి పోస్ట్ చేసినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.ఇకపోతే సమంత ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అందులో నటనకు గాను పలు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందు కుంది.ఇక తెలుగులో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కు చిందులు వేసిన విషయం తెలిసిందే.
ఆ పాట సోషల్ మీడియా లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.అంతే కాకుండా కొద్ది రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఆ పాట మారుమోగి పోయింది.
ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.ఈ పాటను రీ క్రియేట్ చేస్తూ ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా క్రిటీక్స్ చాయ్స్ అవార్డుల ఫంక్షన్ కు సమంత హాజరయ్యింది.ఈ క్రమంలోనే సమంత ఐటెం సాంగ్ పై స్పందించింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఊ అంటావా మావ పాటకు భారీ స్థాయిలో ప్రేక్షక ఆదరణ లభిస్తుంది అని నేను ఊహించలేదు అని తెలిపింది సమంత.ఇది తెలుగు పాట అయినప్పటికీ పాన్ ఇండియా లెవెల్ హిట్ అయ్యింది, జనాలు అంతకు ముందు నేను చేసిన సినిమాలు అన్నీ మర్చిపోయి, ఈ పాటలో చాలా బాగా చేశారు అని చెబుతున్నారు.
ఇది నిజంగా సంతోషకరం అని చెప్పుకొచ్చింది సమంత.ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన సమంత అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.







