పూజ గదిలో వాస్తు దోషాలు ఉంటే ఏమవుతుంది?

ఇల్లు కట్టినప్పుడు ప్రతి ఒక్కరు వాస్తును చూస్తూ ఉండటం సహజమే.

అయితే చాలా మంది కిచెన్,హల్, బెడ్ రూమ్ ఇలా అన్ని రకాలుగా వాస్తును చూస్తారు కానీ పూజ గది విషయానికి వచ్చే సరికి కాస్త అశ్రద్ధ పెడతారు.

కొంతమంది పూజగది కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తారు.కొంత మంది మాత్రం వంటగదిలో ఒక పక్కన ఒక అరను కేటాయిస్తారు.

అయితే పూజగదిలో ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి.

చాలా మంది మనస్సు బాగాలేనప్పుడు దేవుడి గదిని ఆశ్రయిస్తారు.దేవుడి గదిలో కాసేపు కూర్చుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని నమ్మకం.అలాంటి దేవుడి గదిలో ఎక్కువగా విగ్రహాలు ఉంటే కాస్త ఏకాగ్రతకు ఇబ్బందిగా ఉంటుంది.

Advertisement

కాబట్టి పూజగది విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏకాగ్రత కుదిరి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.పూజగదిలో నలుపు,బూడిద,నీలం రంగులను వాడకూడదు.

ఈ రంగులు నిరాశను కలిగిస్తాయి.నిల్చొని హడావిడిగా ఎప్పుడు పూజ చేయకూడదు.

జనపనారతో చేసిన ఆసనం మీద కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవాలి.వంటగదిలో పూజ అల్మారా ఉంటే కనుక ఆ ప్రదేశం ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

అలాగే పూజగది ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవటం ముఖ్యం.ఒకవేళ ఏమైనా వాస్తు దోషాలు ఉంటే వాటి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
బాలీవుడ్ హీరోలకంటే తెలుగు హీరోలే ముద్దు అంటున్న సందీప్ రెడ్డి వంగ...

అందువల్ల దేవుడి గది వాస్తు మీద కూడా శ్రద్ద పెట్టాలి.

Advertisement

తాజా వార్తలు