టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకనిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా మారడమే కాకుండా మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా కూడా మారిపోయింది.
ప్రస్తుతం ఈమె చ బోలెడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది.ఇప్పటికే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవలే రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం అందరికి తెలిసిందే.అలాగే పూజా హెగ్డే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది.ఇది ఇలా ఉంటే తాజాగా తమిళ హీరో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాలో అరబిక్ కుతూ పాట ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం వరుణ్ తేజ్,వెంకటేష్ ల కాంబినేషన్ లో వస్తున్న ఎఫ్ 3 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
ఇప్పటికే పూజా హెగ్డే రంగస్థలంలో జిగేల్ రాణి పాట స్టెప్పులను ఇరగదీసిన విషయం తెలిసిందే.

అయితే మరొకసారి ఐటెం సాంగ్ కోసం ఆఫర్ రాగా అందుకు పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే కేవలం ఒక్క పాట కోసం పూజ హెగ్డే దాదాపుగా 1.25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఒక్క పాట కోసం మరి ఆ రేంజ్ లో డిమాండ్ చేయడమా అని నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎఫ్ 3 సినిమా సినిమా మే 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇందులో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.







