ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ అలాగే వాటిని సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతోంది.అయితే ప్రస్తుతం ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాలు బాగానే హిట్ అవుతుండటంతో పారితోషికం విషయంలో కొంత బెట్టు చేస్తున్నట్లు సమాచారం.
అంతేగాక ఇప్పటికే తన తీసుకున్నటువంటి పారితోషకానికి అదనంగా మరో 30 శాతం పెంచినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి పలు వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ తన చిత్రాలతో ఆకట్టుకొనేటువంటి హీరో అడవి శేష్ ఈసారి సరికొత్త కథనంతో ఓ పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు తమ సొంత బ్యానర్ అయినటువంటి జిఎంబి బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ మొదలు కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా మొదలు కాలేదు.

అయితే ఈ చిత్రంలో నటించడానికి పూజా హెగ్డే ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రంలో అడివి శేష్ సరసన నటించేందుకు పూజా హెగ్డే దాదాపుగా 2.5 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వాలని షరతు పెట్టిందట.దీంతో నమ్రత ఈ పారితోషికం విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని సూచించినప్పటికీ అసలు తగ్గేది లేదని పూజా తెగేసి చెప్పిందట.దీంతో పూజా హెగ్డే స్థానంలో మరో కొత్త హీరోయిన్ ను తీసుకుని తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి “జాన్” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రం దాదాపుగా 60 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
దీంతో దర్శకుడు కేకే రాధాకృష్ణ ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అలాగే పూజ హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.