ఓటిటీలో అలా రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ 2.. ఆదరించడం కష్టమే!

మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం( Mani Ratnam ) డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో అందరికి తెలుసు.

ఎన్నో ఏళ్లుగా తెరకెక్కించాలని అనుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు గత ఏడాది తెరకెక్కించాడు.

కోలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ను( PS 1 ) గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.ఈ భారీ పాన్ ఇండియా సినిమా 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పార్ట్ 1 ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా దాదాపు బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.

పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో మణిరత్నం పార్ట్ 2 ను మరింత వేగంగా పూర్తి చేసాడు.ఇక పొన్నియన్ సెల్వన్ 2( Ponniyin Selvan 2 ) ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే.

Advertisement

ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు.ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.అయితే ఈ సినిమా పార్ట్ 1 కంటే పార్ట్ 2 కు మంచి టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం పార్ట్ 1 లో సగం కూడా రాలేదు.

థియేటర్స్ లో ఆల్మోస్ట్ రన్ పూర్తి చేసుకుంది.

మరి ఈ సినిమా థియేటర్స్ లో తేలిపోవడంతో ఓటిటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ వీడియో( Prime Video ) ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తెచ్చారు.కానీ ఇది ప్రస్తుతం రెంటల్ గా మాత్రమే అందుబాటులో ఉంది.

అన్ని భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఓటిటీలో కూడా 400 రూపాయలతో చూడాల్సి వస్తుంది.మరి ఇంత పెట్టి ఓటిటిలో చూడడం కష్టమే.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు