అందరి హడావుడే తప్ప ఏ క్లారిటీ ఇవ్వని  'పొంగులేటి ' 

ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే హడావుడి చాలాకాలం నుంచి నెలకొంది.

ఒక దశలో ఆయన బిజెపిలో చేరుతున్నారని , కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah) తో  స్వయంగా భేటీ భేటీ అయ్యి మంతనాలు చేశారని , భారీ అనుచర గణంతో .

అమిత్ షా సమక్షంలో బిజెపి కండువా కప్పుకోబోతున్నారనే హడావుడి జరిగినా,  ఆ తర్వాత అంత సద్దుమణిగిపోయింది.ఇక ఆ తర్వాత కాంగ్రెస్ లో  చేరతారనే ప్రచారం జరిగింది.

దీనికి తగ్గట్టుగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో,  పొంగులేటి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని,  కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్( D.K.Shivakuma) తోనూ మంతనాలు చేశారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ పొంగులేటి అనుచరులకు టిక్కెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకొందని ప్రచారం జరిగింది.

దీంతో పొంగులేటి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా ఊపందుకుంది.జూన్ 30వ తేదీన పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్నారని,  ఆయనతో పాటు జూపల్లి కృష్ణారావు , ఎమ్మెల్యే కుచుకుళ్ళ దామోదర్ రెడ్డి , పిడమర్తి రవి కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఈనెల 22వ న కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )తో పొంగులేటి, జూపల్లి , దామోదర్ రెడ్డి భేటీ  కాబోతున్నారనే హడావుడి జరుగుతుంది.ఈ భేటీ అనంతరం తెలంగాణలో వేర్వేరు బహిరంగ సభల్లో వీరంతా కాంగ్రెస్ లో చేరబోతున్నారనే హడావుడి జరుగుతుంది.

Advertisement

ఈనెల 30వ తేదీన ఖమ్మంలో భారీ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేస్తోంది.ఈ సభలోనే పొంగులేటి తోపాటు,  జూపల్లి వంటి వారు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని, రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఈ సభకు హాజరవుతారని ప్రచారం జరుగుతుంది.

అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎక్కడ స్పందించడం లేదు.తాను ఫలానా పార్టీలో చేరుతున్నానని చెప్పడం లేదు.కానీ మీడియాకు మాత్రం లీకులు వస్తూ ఉండడం, పొంగులేటి అనుచరులు హడావుడి చేయడం తప్పితే , స్వయంగా శ్రీనివాస్ రెడ్డి ( Srinivas Reddy ponguleti )ఈ విషయంలో ఏ క్లారిటీ ఇవ్వడం లేదు.

ఆయన పార్టీలో చేరాలంటే చాలా డిమాండ్లు వినిపిస్తున్నారని, ఆ డిమాండ్లకు పూర్తిస్థాయిలో అంగీకారం వస్తేనే బిజెపి అయినా కాంగ్రెస్ లో అయినా చేరుతారనే ప్రచారం జరుగుతుంది.పొంగులేటి రాజకీయ భవిష్యత్తుపై ఇంత గందరగోళం నెలకొన్నా, ఆయన మాత్రం ఏ పార్టీలో చేరుతున్నాననే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు