జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది.భూపాలపల్లిలో నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గండ్ర ఆక్రమాలు నిరూపిస్తానంటూ గండ్ర సత్యనారాయణ ఛాలెంజ్ చేశారు.
ఈ నేపథ్యంలో భూపాలపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని చర్చకు రావాలన్నారు.ఇందుకోసం తన నివాసం నుంచి బయలుదేరిన సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు.
సత్యనారాయణ పోలీసులతో వాగ్వివాదానికి దిగగా… ఆయన ఇంటి గేట్లు తెరిచేందుకు అనుచరులు ప్రయత్నించారు.దీంతో పోలీసులకు, సత్యనారాయణ అనుచరుల మధ్య తోపులాట జరగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
మరోవైపు తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర మండిపడుతున్నారు.







