సాధారణ ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం ఉండగానే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకోవడం మొదలయినట్టే ఉంది….ఇక్కడ జరుగుతున్న విషయాలు మారుతున్న పరిస్థితులు గమనిస్తే విమర్శలు -ప్రతి విమర్శలు , వ్యూహాలు – ప్రతి వ్యూహాలు , ఎత్తులు – పొత్తులు.
ఇలా సాగుతుంది ఇక్కడి రాజకీయం.ఒక వైపు గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి భారీ మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ తాము అమలు చేసిన సంక్షేమ పథకాలనే తమ బలం గా భావిస్తూ ప్రతి పక్షాలను 175 సీట్లలో ఎటువంటి పొత్తులు లేకుండా పోటీ చేయమని సవాల్ విసురుతుంటే ,మరో పక్క ప్రతిపక్ష టీడీపీ అభివృద్ధి లేని పాలన ,పారిశ్రామిక వెనుకబాటు తనం వంటి అంశాలతో పాటు ఇతర ప్రభుత్వ వైఫల్యాలను బలం గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తూ అదే సమయం లో పొత్తుల అంశాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

ఇక గత ఎన్నికల్లో తీవ్ర వైఫల్యం చవిచూసిన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మూడో రాజకీయ ప్రత్యామ్నాయం గా ఎదగాలని ప్రయత్నిస్తూనే ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్లో ,పోరాటాల్లో తమ ఉనికిని చాటుకుంటూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యం అని చెప్తూనే ఉన్నారు .

దాని కోసం ఎవరిని అయినా కలుపుకు వెళ్తాం అని పొత్తుల గురించి చెప్పకనే చెప్తున్నారు….అన్ని ప్రభుత్వ మీటింగుల్లో ,పార్టీ సమావేశాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ విమర్శల తో పాటు ,పార్టీ మానిఫెస్టో నెరవేర్చిన విధానం ,పార్టీ వీధి విధానాల గురించి మాట్లాడుతుంటే ,టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ వ్యూహాలు రచిస్తూనే తనయుడు లోకేష్ “యువగళం” కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రయత్నిస్తున్నారు.ఇక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వాడి వేడి విమర్శలు చేస్తూనే ,త్వరలోనే ” వారాహి ” తో ప్రజల్లోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రస్తుతానికి జనసేన మిత్రపక్షం గా కొనసాగుతున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం రచనలు చేస్తుందిఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది ఇక్కడి రాజకీయాలు ఇంకెంత రసవత్తరం గా మారతాయో వేచి చూడాలి.