రాష్ట్రపతి భవన్ ను చేరిన కరోనా, పోలీస్ ఉన్నతాధికారికి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరిగిపోతూనే ఉన్నాయి.ఒకపక్క లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కేసులు మాత్రం అలానే నమోదు అవుతున్నాయి.

ఈ మహమ్మారి కి పేద, ధనిక అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఎలాంటి లక్షణాలు కూడా లేకపోయినా పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని నిర్ధారణ అవుతుండడం మరో కలవరపెడుతున్న అంశం.పేద దేశాలు.

ధనిక దేశాలన్న ఆలోచన లేకుండా ఈ వైరస్ ప్రతి ఒక్కరిని పలకరిస్తూనే ఉంది.తాజాగా ఈ వైరస్ రాష్ట్రపతి భవన్‌ను కూడా తాకింది.

రాష్ట్రపతి భవన్‌లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు కు కరోనా వైరస్ సోకడం కలవరం సృష్టించింది.పోలీసు ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్ రావడం తో భవన్‌లోని పలువురు భద్రతా సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించినట్టు అధికారులు చెప్పారు.

Advertisement

రాష్ట్రపతి గృహానికి సమీప ప్రాంతంలోనే ఆ పోలీసు అధికారి కార్యాలయం ఉండడంతో ఆ ప్రాంతం మొత్తం శానిటైజేషన్ చేయాల్సి వచ్చింది.వాస్తవానికి ఈనెల 13న అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా తాజాగా ఫలితం వెలువడింది.

అయితే సదరు అధికారికి పరీక్షలు నిర్వహించే సమయంలో కరోనా లక్షణాలు లేనప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యగా ఆయనను ఐసోలేషన్‌కు తరలించారు.అయితే ఆదివారం పరీక్షల ఫలితాల్లో ఆ అధికారికి పాజిటివ్‌గా నిర్దారణ అవ్వడం తో ఆయనతో కలిసి పనిచేసిన మొత్తం భద్రతా సిబ్బందిని క్వారంటైన్‌కి తరలించామని భవన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

గతంలో రాష్ట్రపతి సెక్రటేరియట్ భవనంలో పనిచేసే ఓ ఉద్యోగి బంధువు కరోనా రోగితో సన్నిహితంగా ఉండడంతో అక్కడ పనిచేస్తున్న 115 కుటుంబాలను క్వారంటైన్‌కు తరలించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఇలా పోలీస్ ఉన్నతాధికారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడం తో భవన్ అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.అయితే ఉన్నతాధికారి తో సంబంధాలు పెట్టుకున్న వారి వివరాలను సేకరించి వారి నమూనాలను కూడా పరీక్షించినట్లు తెలుస్తుంది.అయితే ఇంకా వాటి ఫలితాలు రావాల్సి ఉన్నట్లు సమాచారం.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు