చేతి పంపు కొడితే చాలు...బక్కెట్ల కొద్దీ మద్యం.. ఎక్కడంటే..

సర్వసాధారణంగా ఎక్కువగా ఊర్లలో ఉండే చేతి పంపుల నుండి ఎక్కడైనా నీరు వస్తుంది.అయితే ఈ మధ్యకాలంలో ఏపీలోని గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాలలో ఆయిల్ లాంటి పదార్థం బయటికి వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి.

 Police Find Liquor Coming Out From Hand Pump In Madhya Pradesh Details, Police ,-TeluguStop.com

కానీ, విచిత్రంగా ఇక్కడ చేతిపంపులో బకెట్ల కొద్ది మద్యం బయటికి వస్తుంది.ఇది చూసిన పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన అంత పని అయింది.

ఇలాంటి విచిత్రమైన సంఘటన మధ్యప్రదేశ్లోని గుణా లో జరిగింది.ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో డ్రగ్స్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది.

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశించిన మేరకు పోలీసులు ఎక్స్చేంజ్ శాఖ వివిధ స్థానిక జిల్లాలలో పెద్ద ఎత్తున దాడులు చేశారు.ఆ దాడులలో పోలీసులకు ఒక చేతి పంపు అనుమానాస్పదంగా కనిపించింది.

దాన్ని పోలీసు వారు ఉపయోగించినప్పుడు పంపులో నీరు రాకుండా మద్యం వస్తున్నప్పుడు పోలీసులు షాక్ కి గురయ్యారు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుణాలో మద్యం మాఫియా అదిరిపోయే ప్లాన్ చేసింది.అక్రమ మద్యం అమ్మకాల కోసం పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఓ చేతి పంపును ఏర్పాటు చేసింది.

పోలీసులు చేతి పంపును కోట్టి చూసి ఆశ్చర్య పోయారు.

ఇక్కడ చేతి పంపు నుంచి నీళ్లకు బదులు మద్యం రావటంతో అక్రమ మద్యం స్థావరాలపై పోలీసులు జరిపిన దాడుల్లో సుమారు 6 వేల లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని సమాచారం.భాన్‌పురాలో నిందితులు ట్యాంక్‌ను భూమిలో దాచి ఉంచి చేతి పంపును అమర్చి ఎప్పుడు మద్యం కావాలంటే అప్పుడు తీసుకునేలా ప్లాన్ చేశారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం పెద్దఎత్తున జరుగుతున్నట్లు పోలీసులు దాడులు చేయడం వల్ల తెలిసింది.

సీఎం శివరాజ్‌ ఆదేశాల మేరకు పోలీసుల దాడులతో అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టారు అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube