పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో లోకేష్( Nara Lokesh ) చేపట్టిన “యువగళం” పాదయాత్రలో( Yuvagalam ) ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.భీమవరం ప్రకాశం చౌక్ లో వైసీపీ( YCP ) ఏర్పాటు చేసిన హోర్డింగ్ తొలగించడానికి టీడీపీ వాలంటీర్లు ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
దీంతో ఒకరిపై మరొకరు రాళ్ల దాడి చేసుకున్నారు.లోకేష్ పాదయాత్ర ఇందిరమ్మ కాలనీ వైపు చేరుకోగానే ఈ ఘటన మరింత ఉద్రిక్తలకు దారితీసింది.
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు పార్టీలకు చెందిన వారిని చెదరగొట్టడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇప్పటికే లోకేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది.

అయితే నోటీసులు తనకి ఇవ్వటం పట్ల లోకేష్ మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ( TDP ) వాళ్లకి మాత్రమే కాదు వైసిపి వాళ్ళకి కూడా ఇచ్చారా అని పోలీసులను ప్రశ్నించారు.మిధున్ రెడ్డికి( Mithun Reddy ) కూడా ఇచ్చారా అని పోలీసులను నిలదీశారు.ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసులు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం జరిగింది.38 మంది వాలంటీర్లు, చింతమనేని, తోట సీతారామలక్ష్మీ సహా 14 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టడం జరిగింది.అంతేకాదు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు.







