మొదట్లో తడబడిన ఇప్పుడు జగన్ దడలాడిస్తున్నారా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కాస్త తడబడుతూనే వచ్చింది.

రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయడం, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది అసలు అమలు సాధ్యం కాదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేసిన నవరత్నాలు పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలోనూ జగన్ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు.

అయితే ఈ సందర్భంగా తీసుకున్న కొన్నికొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి అటు జగన్ ఇమేజ్ కి చాలా డ్యామేజ్ ని తీసుకొచ్చాయి.ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విధానం పై అటు కేంద్రం నుంచి మొట్టికాయలు వేయించుకున్నా జగన్ మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు.

జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాల నుంచి న్యాయస్థానాల చివరికి ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నాఅవే అంశాలు ఇప్పుడు పాజిటివ్ గా మారి జగన్ ప్రభుత్వానికి పాజిటివ్ వేవ్ తీసుకువచ్చింది.

  ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయాన్ని తీసుకుంటే జగన్ ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం అనే సరికొత్త ఐడియా మంచి ఫలితాలను ఇచ్చినట్టు కనిపించింది.ప్రాజెక్టు వీటి ద్వారా సుమారు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యింది.దీంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం సంతృప్తి చెందింది.

Advertisement

అంతకు ముందు ఈ విధానం పై అనేక విమర్శలు వచ్చాయి.జగన్ మాత్రం ఎక్కడ వెనకడుగు వేయలేదు.

ఇక గ్రామ సచివాలయం పటిష్టం చేసేందుకు భారీగా ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయడం నిజంగా సాహసమే అని చెప్పాలి.నోటిఫికేషన్ ఇవ్వడం, పరీక్ష నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం ఇలా అన్ని చక చక చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.

అదేవిధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పున సమీక్షించాలని నిర్ణయాన్ని జగన్ ఛాలెంజ్ గా తీసుకున్నారు.

  గత తెలుగుదేశం ప్రభుత్వం పి పి ఏ ల విషయంలో భారీ అవినీతికి పాల్పడిందని, వాటిని మరోసారి పున సమీక్షించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు, దీనిపై ఆయా విద్యుత్ సంస్థలు న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కాయి.అంతేకాకుండా దీనిపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైసీపీ మీద విమర్శలు చేశాయి.కాకపోతే ఈ విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో అంతా సైలెంట్ అయిపోయారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు మరోసారి సమీక్షించే అవకాశమే లేదన్న విద్యుత్ కంపెనీలు వాదన హైకోర్ట్ పరిగణలోకి తీసుకోలేదు.ఇలా చెప్పుకుంటూపోతే జగన్ నిర్ణయాలు మొదట్లో విమర్శలు పాలైన, ఇప్పుడిప్పుడే వాటి ఫలితాలు ప్రభుత్వంపై సానుకూల దృక్పథాన్ని ఏర్పరుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు