పోకో ఎక్స్6 నియో 5G స్మార్ట్ ఫోన్( Poco X6 Neo 5G ) 108ఎంపీ డ్యూయల్ కెమెరా, 120Hz AMOLED డిస్ ప్లే లాంటి అద్భుతమైన ఫీచర్లతో భారత మార్కెట్లో ఈరోజు లాంచ్ అయింది.ఈ ఫోన్ కు సంబంధించిన మరిన్ని ఫీచర్ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.పోకో ఎక్స్6 నియో 5G స్మార్ట్ ఫోన్: ఈ ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్ ప్లే తో వస్తోంది.120Hz రిఫ్రెష్ రేట్, 100 నిట్స్ బ్రైట్ నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో ఉంటుంది.7.69mm మందంతో పర్ఫెక్ట్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది.ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 5G ప్రాసెసర్ తో వస్తుంది.
ఈ ఫోన్ 8GB RAM/12GB RAM మరియు 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్లో అందుబాటులో ఉంది.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది.12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది.అయితే ఈ ఫోన్ పై రూ.1000 రూపాయల ఐసీఐసీఐ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్( Discount Offer ) ఉంది.రూ.1000 రూపాయల ఎక్సేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా( Poco X6 Neo 5G Features ) విషయానికి వస్తే.108ఎంపీ+2ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరాతో ఉంటుంది.సెల్ఫీల కోసం, వీడియోల కోసం 16 ఎంపీ కెమెరా తో ఉంటుంది.
ఈ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో 1080p వీడియోలను షూట్ చేయవచ్చు.ఈ ఫోన్ MIUI 14 సాప్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 13 OS ఆధారంగా పనిచేస్తుంది.ఈ ఫోన్లో ఉన్న మోనో స్పీకర్ ఉన్నా కూడా Dolby Atmos సపోర్ట్ అందించారు.5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 33w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ మార్టియన్ ఆరంజ్, హరీజోన్ బ్లూ, అస్ట్రల్ బ్లాక్ కలర్ ఆప్షన్ లలో ఉంటుంది.