అక్రమ వలసలను అడ్డుకోవడంపై బ్రిటన్ పురోగతి సాధించిందన్నారు ఆ దేశ ప్రధాని రిషి సునాక్.శరణార్ధిగా ఆశ్రయం కోరుతున్న కేసులను పరిష్కరించి ఆ భారాన్ని తగ్గించినట్లుగా రిషి తెలిపారు.
చిన్న పడవల్లో ఇంగ్లీష్ ఛానెల్‌ను దాటుతున్న వారి సంఖ్య గతేడాది 36 శాతం తగ్గినట్లుగా ప్రధాని గుర్తుచేశారు.గడిచిన ఐదేళ్లలో తొలిసారిగా ఈ తగ్గుదల నమోదైనట్లుగా ఆయన వెల్లడించారు.
దేశ ప్రజలపై అక్రమ వలసల భారానికి ముగింపు పలకాలని తాను నిర్ణయించుకున్నానని, ఈ చర్యలతో ట్యాక్స్ పేయర్స్ సొమ్మును ఆదా చేస్తున్నామని రిషి సునాక్ పేర్కొన్నారు.బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతూ దరఖాస్తు చేసిన వారు హోటళ్లు, నిర్బంధ కేంద్రాల్లో వుండటంతో వారి నిర్వహణ నిమిత్తం ప్రభుత్వంపై రోజుకు 10.2 మిలియన్ డాలర్ల భారం పడుతోంది.అందుకే రిషి సునాక్ ఈ దరఖాస్తులపై ఫోకస్ పెట్టారు.
మరోవైపు.బ్రిటన్ యూనివర్సిటీల్లో చదవుకోవాలని అనుకునే అంతర్జాతీయ విద్యార్ధులకు కొత్త వీసా నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.ఇకపై విద్యార్ధి వీసా( Student Visa )పై వారి కుటుంబ సభ్యులను యూకేకు తీసుకురావడం కుదరదు.ఈ నిర్ణయంతో వేల సంఖ్యలో వలసలు తగ్గుతాయి, ఈ విధంగా దాదాపు 3 లక్షల మందిని అడ్డుకోవచ్చని బ్రిటన్ హోంశాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ( James Cleverly ) వెల్లడించారు.
ఇకపోతే.బ్రిటన్‌లోకి అక్రమ వలసలను అరికట్టేందుకు గాను ప్రధాని రిషి సునాక్ “Stop the Boats” నినాదాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జరగనున్న సాధారణ ఎన్నికల ముందు ఇది ఆయన అభ్యర్ధిత్వానికి కీలకమైనదిగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చిలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రధాని రిషి సునాక్( Rishi Sunak ), మాజీ హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్‌లు అక్రమ వలస బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
చిన్న బిన్న పడవల్లో అక్రమంగా బ్రిటన్( Britain )లోకి ప్రవేశించే వారిని అరెస్ట్ చేసి వారిని తిరిగి స్వదేశానికి లేదంటే మూడో దేశానికో పంపించాలని బిల్లు ప్రతిపాదించింది.
అటువంటి వ్యక్తి తర్వాతి కాలంలో యూకేలోకి రాకుండా శాశ్వతంగా నిషేధించబడతాడు.ఫ్రాన్స్ నుంచి చిన్న పడవల ద్వారా యూకేకు అక్రమంగా తరలించేందుకు మానవ అక్రమ రవాణా ముఠాలు ఒక్కొక్కరి నుంచి 3000 పౌండ్లను వసూలు చేస్తున్నాయి.ఇదొక పెద్ద రాకెట్.
స్మగ్లింగ్ గ్యాంగ్‌లు డింగీలను ( చిన్న ప్లాస్టిక్ బోటు) టర్కీలో కొనుగోలు చేస్తాయి.అనంతరం వాటిని జర్మనీకి తరలించి, వాటిని ఫ్రాన్స్‌కు తీసుకెళ్తాయి.
అక్కడి నుంచి అక్రమ వలసదారులను పడవల్లో ఎక్కించి ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా బ్రిటన్‌కు చేరుస్తాయి.అయితే మార్గమధ్యంలోనే పడవలు మునిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.